Rain Forest: మోదీ ఖాతాలో మరో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్..! ఎల్లుండే ప్రారంభం

నర్మదా నదీ తీరంలో విశ్వవిఖ్యాతి గాంచిన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' ప్రాంగణం మరో నూతన ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణను సంతరించుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా... జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (అక్టోబర్ 31) పురస్కరించుకుని గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో సుమారు రూ.9.49 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యద్భుత 'రేన్ ఫారెస్ట్' (వర్షాధార అడవి) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఏకో-టూరిజం, ప్రకృతి విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో వగాదియా చెక్‌పోస్ట్ సమీపంలో ఏకంగా 47,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ హరిత వనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

220 మీటర్ల గ్లాస్ స్కైవాక్.. ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణ

ఈ 'రేన్ ఫారెస్ట్' ప్రాజెక్టులో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ప్రధాన అంశం 220 మీటర్ల పొడవైన 'గ్లాస్-డెక్ స్కైవాక్ బ్రిడ్జ్'. అటవీ సానువుల పైన ఎత్తులో నడుస్తూ, చుట్టూ ఉన్న దట్టమైన చెట్ల వరుసలను, ప్రకృతి అందాలను బర్డ్స్ ఐ వ్యూ చేసేలా దీనిని డిజైన్ చేశారు. పశ్చిమ కనుమలు, హిమాలయాలు, అండమాన్ నికోబార్ దీవుల నుంచి సేకరించిన అనేక రకాల అరుదైన, ప్రాచీన వృక్ష జాతులను ఇక్కడ ప్రత్యేకంగా పెంచుతున్నారు. భారతదేశపు విభిన్న ప్రకృతి వైవిధ్యాన్ని ఒకే చోట ఆవిష్కరించడం ఈ వనం ప్రత్యేకత.

PM Narendra Modi to Inaugurate Unique Rain Forest Project Worth 9 5 Crore at Ekta Nagar in Gujarat
సమగ్ర పాడి అభివృద్ధి పథకం: మూడువేల రూపాయలకే.. 90 వేలు విలువైన పాడి పశువు
సమగ్ర పాడి అభివృద్ధి పథకం: మూడువేల రూపాయలకే.. 90 వేలు విలువైన పాడి పశువు

ప్రకృతి సిద్ధమైన కట్టడాలు.. చిన్నారులకు ప్రత్యేక వినోదం

ఇక్కడ ప్రతి నిర్మాణం ప్రకృత్యనుకూలంగా రూపుదిద్దుకుంది. ఎంట్రన్స్ వద్ద 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో సహజ సిద్ధమైన రాతితో భారీ సింహద్వారాన్ని నిర్మించారు. 5 నుంచి 8 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే కృత్రిమ జలపాతం, వృత్తాకార తటాకం, నర్మదా రాతి పరిచిన కాలిబాటలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే విద్యార్థులు, శాస్త్రవేత్తల కోసం అటవీ వ్యవస్థపై అవగాహన పెంచే సమాచార కేంద్రాన్ని (Information Centre) క్యూఆర్ కోడ్ డిస్ప్లేలతో ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం రాక్ క్లైంబింగ్ వాల్స్, ట్రీ బాల్కనీలు, స్లైడ్స్ వంటి ఆటపాటల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.

సింహాలొచ్చేశాయ్! 143 ఏళ్ల తర్వాత అడవిలోకి పూర్వ ఆగమనం..
సింహాలొచ్చేశాయ్! 143 ఏళ్ల తర్వాత అడవిలోకి పూర్వ ఆగమనం..

'ట్రెయిల్ ఆఫ్ యునైటెడ్ ఇండియా'.. 2.62 కిలోమీటర్ల కళాత్మక బాట

జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ 'ట్రెయిల్ ఆఫ్ యునైటెడ్ ఇండియా' అనే ప్రతిష్టాత్మక 2.62 కిలోమీటర్ల ప్రత్యేక థీమ్ వాక్‌ను కూడా ప్రారంభించనున్నారు. 'భిన్నత్వంలో ఏకత్వం' చాటే శిల్పకళాఖండాలతో రూపుదిద్దుకున్న ఈ అటవీ బాట భారత సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. వీటితో పాటు ఏక్తా నగర్‌లో ఏక్తా పరేడ్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారిచే 'ఆనంద్ మఠ్' ప్రదర్శనలు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+