ప్రేమ గురించి తెలిసే చదువు మాన్పించారు: శ్రీజ
హైదరాబాద్: ప్రేమ గురించి తెలిసి ఏడాది క్రితమే చిరంజీవి కూతురు శ్రీజను చదువు మాన్పించి, ఇంట్లోనే ఉంచుతున్నారు. ఈ విషయాన్ని శ్రీజ స్వయంగా ప్రైవేట్ తెలుగు టీవీ చానెళ్ల ప్రతినిధులతో తెలిపారు. దీంతో వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని భయపడి పారిపోయి వచ్చి శిరీష్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పారు. తమ ప్రేమ విషయం తమ కుటుంబ సభ్యులకు తెలుసునని ఆమె అన్నారు.
శ్రీజను ఏడాది కాలంగా గృహ నిర్బంధంలో ఉంచారని, వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారనే ఉద్దేశంతోనే తాము తొందర పడి పెళ్లి చేసుకున్నామని భరద్వాజ్ చెప్పారు. తాను సాధారణ వ్యక్తినని, పోలీసులు తమకు రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. పెద్దమ్మ తల్లి ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతామని, తాను పెద్దమ్మ తల్లి భక్తుడనని ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. భరద్వాజ్ కు జనార్దన్ రెడ్డి కుమారుడు మిత్రుడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications