రు.2 బియ్యం పేటెంట్ ఎన్టీఆర్ దే: వైయస్


మెదక్/నిజామాబాద్/ మహబూబ్ నగర్: రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేటెంట్ స్వర్గీయ ఎన్టీ రామారావుదేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని వచ్చే ఏడాది మార్చి నుంచి గానీ ఏప్రిల్ నుంచి గానీ అమలు చేస్తామని ఆయన ఆయన బుధవారంనాడు మెదక్ జిల్లా పర్యటనలో చెప్పారు. ఆయన బుధవారంనాడు మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇందిరమ్మ గృహాలకు సంబంధించిన పర్యటన చేశారు.

శ్రీరాంసాగర్ వరద కాలువ నిర్వాసితులకు లోక్ అదాలత్ ద్వారా నష్టపరిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తామని ఆయన నిజామాబాద్ జిల్లాలో చెప్పారు. చిట్టాపూర్ లో ఆయన ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. మహబాబ్ నగర్ జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాకు జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం వస్తుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ గృహాలను పేదలందరికీ ఇస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+