ఖమ్మం జిల్లాలో 4గురు నక్సల్స్ హతం
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కిన్నెరసాని వాగు వద్ద పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మరణించారు. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ కూడా ఉంది. మరణించిన నక్సలైట్లలో జనశక్తి దళ కమాండర్ ప్రకాష్ ఉన్నట్లు సమాచారం.
పోలీసులు గాలింపు జరుపుతుండగా నక్సలైట్లు తారసపడ్డారు. ఈ సమయంలో నక్సల్స్ పారిపోతూ పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతూ కిన్నెరసాని వాగులో దూకి పారిపోతుండగా పోలీసుల కాల్పుల్లో నక్సల్స్ మరణించారు.












Click it and Unblock the Notifications