తండ్రి బాధపడుతున్నట్లున్నారు: చిరు కూతురు శ్రీజ
న్యూఢిల్లీ: తాను తన పెద్దమ్మతో మాట్లాడానని, అయితే తమకు అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదని శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ చెప్పింది. తమకు ఇంకా ప్రాణభయం ఉందని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నది. తమ నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదని మాత్రమే తన కుటుంబం నుంచి హామీ వచ్చిందని ఆమె చెప్పింది. తన తండ్రి చిరంజీవి చాలా బాధ పడుతున్నట్లు ఉన్నారని, అందుకు క్షమించాలని తాము కోరామని ఆమె చెప్పింది.
తమపై ఇంకా దాడి చేసే అవకాశం ఉందని ఆమె అన్నది. మరో రెండు వారాల్లో హైదరాబాద్ వెళ్తామని, శిరీష్ భరద్వాజ్ ఇంట్లో ఉంటామని ఆమె చెప్పింది. తమ మిత్రులకు తమను బెదిరిస్తూ మెసేజులు వచ్చాయని శిరీష్ భరద్వాజ్ చెప్పాడు. తాము రెండు వారాల్లో హైదరాబాద్ వెళ్తామని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications