నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం: 19 మంది మృతి
హైదరాబాద్: వరద బీభత్సానికి నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లు సమాచారం. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇంకా నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. సంగం వద్ద పెన్నా - బొగ్గేరు మధ్య 15 మంది గిరిజనులు వరదల్లో చిక్కుకున్నారు. దాదాపు 50 చెరువులకు గండ్లు పడినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
కడప జిల్లా చిట్వేలు సమీపంలోని అనుంగురాజు పల్లి వద్ద వరదలో చిక్కుకున్న బస్సులోని వ్యక్తుల్లో నలుగురు మృతి చెందగా ముగ్గురు గల్లంతయ్యారు. బస్సులో 25 మంది ఉండగా 18 మందిని సురక్షితంగా బయటకు తీయగలిగారు. 18 మందిని నెల్లూరు జిల్లాలోని రాపూరుకు తరలించారు. మృతుల్లో శ్రీకాళహస్తికి చెందిన వసంతకుమారి అనే మహిళ, ఇద్దరు హోంగార్డులున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వరద తీవ్రత ఉంది. ఈ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.












Click it and Unblock the Notifications