పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు..? ఆ రోజు నుంచే, ఎంత మేరంటే..!?
మరోసారి పెట్రో ఉత్పత్తుల ధరలు పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు పూర్తి కాగానే ధరల పెంపు ఉంటుందని ప్రతిపక్షాలు చెబుతూ వచ్చాయి. ఎలాంటి పెంపు లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసాయి. ఇదే సమయంలో కొంత మేర పెంపు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. కాగా.. తాజాగా ఆయిల్ కంపెనీల నుంచి వస్తున్న తాజా ప్రతిపాదనల మేరకు పెంపు తప్పదనే విధంగా ప్రస్తుత కసరత్తు కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ధరల పెంపు ఉంటుందని అంచనా.
పెట్రో బాంబ్ జనం నెత్తిన వేయటానికి రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఆయల్ కంపెనీలు ఈ మేరకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు సమర్పించాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావటం తో ఇక ధరల పెంపు పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం.. ఆ తరువాత వరుసగా వాణిజ్య సిలిండర్ల ధరలను భారీగా పెంచు తూ నిర్ణయాలు తీసుకుంది. కాగా.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే లీటరు పెట్రోల్ ధర రూ. 4 నుంచి రూ. 5 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధర కూడా రూ. 40 నుండి రూ. 50 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. చమురు ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని అంచనా వేస్తన్నారు.

మే 15వ తేదీ నుంచి ధరల పెంపుకు కసరత్తు..!
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుత సరఫరా పైన ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర సుమారు 70 డాలర్ల నుంచి 126 డాలర్లకు పెరగడం వల్ల చమురు కంపెనీలు రోజువారీ కార్యకలాపాల్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై సుమారు రూ. 24 భారాన్ని ప్రభుత్వంతో కలిసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే భరిస్తుండగా, ఈ నష్టం నెలకు రూ. 30,000 కోట్లకు చేరుకోవడం ఆందోళనకరం. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే, పెట్రోల్ ధర లీటరుకు రూ. 4 నుండి రూ. 5 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర కూడా సుమారు రూ. 40 నుండి రూ. 50 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరో వారం రోజుల్లో ఈ ధరల పెంపు పైన నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.













Click it and Unblock the Notifications