మిల్లెట్ బియ్యం- షుగరు, బీపీ బాధితులకు వరం..!!

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. చిన్న వయసులోనే అనేక కారణా లతో మధుమేహం, బీపీ, గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఆహారంతో పాటుగా జీవన శైలిలోనూ మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మిల్లెట్స్ ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. చిరు ధాన్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఇప్పుడు మిల్లెట్ రైస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మిల్లెట్ రైస్ వినియోగం ప్రత్యేకంగా షగరు.. బీపీ బాధితులకు వరంగా మారనుంది. వీటి వినయోగంతో పాటుగా ప్రయోజనాల గురించి నిపుణు లు కీలక సూచనలు అందిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని సిఫార్సు చేసింది. తాజాగా.. ఆరోగ్య పరంగా వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో పేర్కొంది. మధుమేహం, ఊబకాయం నియంత్రణకు చిరుధాన్యాలు సత్ఫలితాలిస్తున్నట్లు వెల్లడించింది. కొర్రలు, రాగి, సజ్జలను ఆహారంగా తీసుకున్న వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి నియంత్రణతో పాటుగా జీర్ణక్రియ మెరుగవడం .. హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. చిరుధాన్యాలతో ఎనలాగ్‌ బియ్యం తయారు చేశారు ఐఐఎంఆర్‌ పరిశోధకులు. అది కేవలం చూడడానికే కాదు, వరన్నంలాగే తెల్లగా, కూరతో కలిపి ముద్దగా చేసుకొని తినడానికి అనువుగా, రుచిగా ఉంటుంది. బిర్యానీ, పులిహోర, పులావ్‌ లాంటి కమ్మని వంటకాలెన్నో ఎనలాగ్‌ రైస్‌తో వండుకోవచ్చు.

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా- ఏం జరుగుతుంది..!!
ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా- ఏం జరుగుతుంది..!!
millet-rice-include-improved-digestion-weight-loss-heart-health-and-regulated-blood-sugar-levels

నిపుణుల సూచనలు

ప్రస్తుతం 350గ్రాముల ఎనలాగ్‌ రైస్‌ను రూ.65కు విక్రయిస్తున్నారు. మిల్లెట్స్‌ను ముందుగా దేనికదే పిండి పట్టించి... దాన్ని మరొక మిషీన్‌ద్వారా ఎక్స్‌ట్రూషన్‌చేయగా బియ్యం గింజల రూపంలోకి వస్తాయి. వాటిని ఆరబెట్టి ప్యాక్‌ చేస్తున్నారు. చిరుధాన్యాలతో కేకులు, బ్రెడ్‌, బిస్కెట్లు, కూకీస్‌, మఫిన్లు, సేమియా, పేలాలు, పాస్తా, న్యూట్రీబార్‌, కారప్పూస, జంతికలు వంటి రుచికర మైన పదార్థాలు మరెన్నో న్యూట్రీహబ్‌ లో తయారుచేస్తున్నారు. జొన్న, సజ్జలతో మోడిఫైడ్‌ పిండిని కొద్దిరోజుల్లో అందుబాటులోకి తేనుంది ఐఐఎంఆర్‌. చపాతీ కర్రతో ఒత్తుతూ మోడిఫైడ్‌ పిండితో చాలా తేలిగ్గా రొట్టెలు చేయచ్చు. మిల్లెట్‌ ఇడ్లీ, పొంగల్‌, సూప్‌ రెడీమిక్స్‌లు సైతం భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ప్రాంగణంలో లభ్యమవుతాయి. మిల్లెట్ ఉత్పత్తులను తరచూ ఆహారంగా తీసుకోవటం ద్వారా ఆరోగ్యంతో పాటుగా దీర్ఘ కాలిక సమస్యలకు పరిష్కారంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+