అదే మన లక్ష్యం, గళం విప్పాలి - తేల్చి చెప్పిన పవన్..!!

డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం అవుతున్న వేళ పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రం ఈ సారి సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతోంది. మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించేలా వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ సమయంలో పార్టీ ఎంపీలకు పవన్ దిశా నిర్దేశం చేసారు. పార్టీ వైఖరి స్పష్టం చేసారు.

దేశ ప్రయోజనాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపించాలని పవన్ కళ్యాణ్ తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలను సాధించడమే లక్ష్యంగా ప్రతి అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. నేషన్‌ ఫస్ట్‌ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పార్లమెంట్‌ వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు.

వైసీపీ కాచుకొని కూర్చింది - స్థానిక ఎన్నికల సీట్ల షేరింగ్ పై తేల్చేసిన చంద్రబాబు..!!
వైసీపీ కాచుకొని కూర్చింది - స్థానిక ఎన్నికల సీట్ల షేరింగ్ పై తేల్చేసిన చంద్రబాబు..!!
pawan-kalyan-stated-every-opportunity-must-be-utilized-to-achieve-state-interests-to-the-party-mps

పార్లమెంట్ సమావేశాల వేళ పవన్ దిశా నిర్దేశం

ఏపీలో నిర్మాణం దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభ జన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. పార్లమెంట్‌లో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, రాష్ట్ర హక్కుల కోసం గళం వినిపించాలని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన లక్ష్యమని పేర్కొంటూ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+