వైసీపీ కాచుకొని కూర్చింది - స్థానిక ఎన్నికల సీట్ల షేరింగ్ పై తేల్చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికలకు పార్టీ కేడర్ సమాయత్తం కావాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల పంపకాల పైన చర్చ జరుగుతున్న వేళ స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ అవకాశం కోసం కాచుకొని కూర్చొందని కూటమి పార్టీల నేతలు అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. ఎన్నికల్లో గెలుపు ద్వారా కూటమి బలం ఏంటో స్పష్టం అయ్యేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేసారు.
స్థానిక ఎన్నికల పైన పార్టీ నేతలకు చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని సీఎం సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల పంపకాల మధ్య జరుగుతున్న చర్చ వేళ చంద్రబాబు స్పందించారు. ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మూడు పార్టీల అగ్రనాయకత్వాలు చర్చించి నిర్ణయానికి వస్తాయని తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచే చర్చలు అవసరం లేదని..ఈ విషయాన్ని మూడు పార్టీల అధినాయకత్వాలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేసారు. కూటమి పార్టీల నడుమ విభేదాలు సృష్టించేందుకు వైసీపీ కాచుకుని కూర్చుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి హెచ్చరించారు.













Click it and Unblock the Notifications