సీమలో తేల్చుంకుందాం, రా: కెసిఆర్ కు సవాల్
న్యూఢిల్లీ: రాయలసీమలో తేల్చుకుందాం రావాలని రాయలసీమ ఐక్య వేదిక నాయకుడు టి.జి. వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు సవాల్ విసిరారు. హైదరాబాదును తెలంగాణ నుంచి విడదీస్తే రక్తపుటేరులు పారుతాయని చంద్రశేఖరరావు అంటున్నారని, శ్రీశైలం నీరు తీసుకుంటే బాంబుల వర్షం కురుస్తుందని తాము అనాల్సి వస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధు సమావేశంలో అన్నారు. గాంధీ మార్గంలో ఉద్యమం చేస్తామని అంటున్న కెసిఆర్ రక్తపుటేరులు పారుతాయని ఎందుకంటున్నారని ఆయన అడిగారు.
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ వీరప్పమొయిలీని ఆయన కలిశారు. ప్రతి ఒక్కరినీ తరిమికొడ్తామని కెసిఆర్ అంటున్నారని, ఈ విధమైన పద్ధతి సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసి ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లేనని, అప్పుడు తమ సంగతి ఏమిటని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాయలసీమకు లక్ష కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications