వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం అనుమతి: తెలుగు సినిమాకు మోనికా రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews


Monica Bedi న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి సినీ నటి మోనికా బేడీకి సుప్రీంకోర్టు అనుమతి కల్పించింది. తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని, అందుకు తాను దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని అంటూ అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మోనికా బేడీ పిటిషన్ దాఖలు చేసింది. అందుకు మోనికా బేడీకి అవకాశం కల్పిస్తూ ఎక్కడికి వెళ్లినా పోలీసులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ పాసుపోర్టు కేసులో నిందితురాలైన మోనికా బేడీకి కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమెకు తన ఇంటినుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

సుప్రీంకోర్టు అనుమతితో తెలుగు సినిమాలో నటించేందుకు అవకాశం ఏర్పడింది. మోనికా బేడీ సరిపోయే కథను రూపొందించి సినిమా తీసేందుకే ఇప్పటికే ఒక తెలుగు దర్శకుడు సిద్ధంగా ఉన్నాడు. తాను రూపొందించుకున్న కథలోని పాత్రకు మోనికా బేడి సరిగ్గా అతుకుతుందని అతను అంటున్నాడు. ఆమె కోసమే ఆ కథను తయారు చేశానని కూడా చెప్పుకుంటున్నాడు. తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని, తెలుగు సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయని ఆమె జైలు నుంచి విడుదలైన సందర్భంలో చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X