వైయస్ ఉప్పూకారం మానేయాలి: రాఘవులు
హైదరాబాద్: ఉప్పూ కారం మానేయాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సూచించారు. వైయస్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వివాదంలో తప్పు వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప్పూ కారం తింటున్న ప్రజలు తమ నోళ్లను అదుపులోనే ఉంచుకుంటున్నారని ఆయన అన్నారు.
నోరు జారి తప్పు చేసిన రాజశేఖర రెడ్డి నెపం ఉప్పూ కారాలపై నెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తప్పు చేసి సిగ్గుపడాల్సింది పోయి రాజశేఖర రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు. అంబుడ్స్ మన్ అంటే వామపక్షాలకు అర్థం తెలియదని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ ముఖ్యమంత్రి నేర్పిస్తే తాము నేర్చుకుంటామని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు చూపిస్తే వేయి రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అక్రమాలపై వార్తలు రాసిన జర్నలిస్టులను అరెస్టు చేయించారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
