ప్రియురాలి గొంతు కోసి హత్య చేసిన యువకుడు
అనంతపురం: ప్రియురాలిని గొంతు కోసి చంపిన ప్రియుడి ఉదంతం అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం చాగల్లు గ్రామంలో సంచలనం సృష్టించింది. సోము అనే యువకుడు అనిత ఇంటర్మీయడట్ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. అనిత చాగల్లులోని ఇంటర్మీడియట్ చదువుతోంది. సోము చాగల్లు రిజర్వాయరులో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వారిద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
అనిత తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెను సోము ఊరు బయటకు తీసికెళ్లాడు. తామిద్దరం వివాహం చేసుకుందామని అతను ప్రతిపాదించాడు. అయితే తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకుందామని ఆమె చెప్పినట్లు సమాచారం. దీంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగిందని అంటున్నారు. దీంతో అతను అనిత గొంతు కోసి హత్య చేశాడు.












Click it and Unblock the Notifications
