డిసెంబర్ 8న గూగుల్ కో ఫౌండర్ పేజ్ పెళ్లి
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ ఇన్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు అయిన లారీ పేజ్ తన గర్ల్ ఫ్రెండ్ ను వివాహమాడబోతున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 8వ తేదీన జరుగుతుంది. వివాహం జరిగే ప్రదేశాన్నని గుట్టుగా ఉంచుతున్నారు. ఈ విషయాన్ని ది శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ వార్తా కథనం వెల్లడించింది. పేజ్ తో జీవితాన్ని పంచుకోబోతున్న లూసీ సౌత్ వర్త్ స్టాన్ ఫోర్డులో బయె మెడికల్ ఇన్ ఫార్మాటిక్స్ డాక్టోరల్ విద్యార్థిని.
పేజ్, లూసీ ఏడాది కాలంగా కలిసి తిరుగుతున్నారు. 34 ఏళ్ల పేజ్ స్టాన్ ఫోర్డు విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ డాక్టోరల్ విద్యార్థిగా గూగుల్ ప్రారంభానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఆయన 20 బిలియన్ డాలర్లతో సిలికాన్ వ్యాలీలోని రిచెస్ట్ బ్యాచులర్. వర్జిన్ బిజినెస్ ఎంపైర్ వ్యవస్తాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ గావిన్ న్యూసమ్ లతో పాటు గూగుల్ ఉద్యోగులు హాజరవుతారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఆల్ గోరేకు ఆహ్వానం అందింది. నోబెల్ బహుమతి అందుకోవడానికి వెళ్తున్నందున రాలేనని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications