పాకిస్తానులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు
ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ లాహోరులో అరెస్టయ్యారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనకు నాయకత్వం వహించడానికి రహస్య స్థావరం వీడి పంజాబ్ విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయనను భద్రతా దళాలు బుధవారంనాడు అరెస్టు చేశాయి. ముషార్రఫ్ అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే ఈ నెల 3వ తేదీన అజ్ఞాతంలోకి వెళ్లారు.
జమాత్ - ఎ - ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంఘం ఇస్లామీ జమైత్ తులేబా తన అరెస్టుకు కారణమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తగిన రక్షణ కల్పిస్తామని విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇమ్రాన్ ఖాన్ కు హమీ ఇచ్చారు. అయితే ఒక గ్రూపు విద్యార్థులు ఆయనను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యార్థులను కూడగట్టాలనే తన లక్ష్యం నెరవేరిందని ఇమ్రాన్ ఖాన్ అన్నట్లు స్థానిక మీడియా తెలియజేసింది.












Click it and Unblock the Notifications