ప్రతి ఎమ్మెల్యే హాస్టల్లో రెండు నెలలకో సారి బస


హైదరాబాద్: ప్రతి శాసనసభ్యుడు రెండు నెలలకు ఒకసారైనా తన నియోజక వర్గంలోని బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతిగృహాల్లో ఏదో ఒక దానికి ఆకస్మికంగా వెళ్లి అక్కడి విద్యార్థులతో బస చేయాలని శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సూచించారు. అందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. తాను ఈ వారం నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని స్పీకర్ చెప్పారు. ఆకస్మికంగా హాస్టల్ కు వెళ్లి అక్కడి విద్యార్థులతో బస చేస్తానని ఆయన చెప్పారు. ఈ శనివారమే తాను వెళ్తానని ఆయన చెప్పారు.

సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితిపై అవగాహనకు, వాటిని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని స్పీకర్ భావించారు. స్పీకర్ సూచనను తెలుగుదేశం శాసనసభా పక్షం ఉప నాయకుడు టి. దేవేందర్ గౌడ్ స్వాగతిస్తూ అలా బస చేస్తే వసతిగృహాల పరిస్థితి ఏమిటో తెలిసివస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ విషయమై ఒక నోట్ పంపాలని ప్రభుత్వానికి సూచించాలని ఆయన స్పీకరును కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+