ఆంధ్రప్రదేశ్ లో డిసెంబరులో 'ఆటా' వేడుకలు
హైదరాబాద్: మన ఊరిలో ఆటా సంబరాలు పేర తృతీయ ఆటా వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి. డిసెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించాలని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్ణయం తీసుకుంది. ఆటా అధ్యక్షుడు చంద్రారెడ్డి గవ్వా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జితేందర్ రెడ్డి, అంతర్జాతీయ సమన్వయ కర్త హరినాధ్ పొలిచెర్ల, ఓవర్సీస్ కోఆర్డినేటర్ వి.ఎస్. రెడ్డి, నరోత్తమ్ రెడ్డిల నాయకత్వంలో ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ప్రముఖ స్థానిక నాయకులు, ఎన్నారై కుటుంబాల సభ్యులు ఐ వేడుకల్లో పాల్గొంటారు.
తమ తెలుగు సంస్కృతికిని, వారసత్వాన్ని కాపాడుకునేందుకు, ఆంధ్రప్రదేశ్, అమెరికాల్లోని ప్రజల మధ్య నిరంతర సంభాషణకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధి రవి గవ్వా ఒక ప్రకటనలో తెలిపారు. వేడకలు డిసెంబర్ 24న నెల్లూరులో, 27వ తేదీన సూర్యాపేటలో జరుగుతాయని, ఆ తర్వాత 28 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాదులోని రవీంద్రభారతిలో, తాజ్ కృష్ణాలో జరుగుతాయని ఆయన చెప్పారు. సాహితీ సభ, తెలుగు భాష, తెలుగు ప్రభావం చర్చలు, ఆటా యూత్, స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గేయాలాపన, నృత్యాలు ఉంటాయని ఆయన వివరించారు. గ్రామాన్ని సాకుకోండి - మాతృభూమిని ఆదుకోండి పేరిట రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications