బిజెపికి జెడి - ఎస్ మద్దతు ఉపసంహరణ
బెంగూళూర్: కర్ణాటకలో బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుంది. ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వానికి జనతా దళ్ - సెక్యులర్ (జెడి -ఎస్)మద్దతు ఉపసంహరించుకుంది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జెడి - ఎస్ నేత దేవెగౌడ తన పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో ఎక్కువ అధికారాలు ఆశించిన జెడి -ఎస్, అందుకు బిజెపి అంగీకరించకపోవడంతో మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
జెడి -ఎస్ రూపొందించిన 12 అంశాల అవగాహన పత్రంపై సంతకం చేయడానికి బిజెపి నిరాకరించింది. దాంతో జెడి - ఎస్ యెడ్యూరప్ప ప్రభుత్వ బలపరీక్షలో వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 225 సీట్లు ఉండగా బిజెపికి 79 మంది, జెడి - ఎస్ కు 58, కాంగ్రెస్ కు 65 మంది శాసనసభ్యులున్నారు. ఇతరులు 23 మంది ఉన్నారు. వెంటనే రాజీనామా చేయాలని బిజెపి అధిష్ఠాన వర్గం యెడ్యూరప్పకు సూచించింది.












Click it and Unblock the Notifications