తెలంగాణపై రాహుల్ ను ఒప్పిస్తాం: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. ప్రస్తుత స్థితిలో రాహుల్ గాంధీ జపం తప్పదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని, ఈ విషయం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీకి కూడా తెసుననని ఆయన అన్నారు.
తెలంగాణపై చర్చకు వీరప్ప మొయిలీ పిలిస్తే తాను వెళ్తానని, తెలంగాణపై పార్టీ నాయకులపై వీరప్ప మొయిలీ చేసిన ప్రకటన తనను ఉద్దేశించింది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి కులతత్వం ఉందనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత నాయకులందరూ ఏకతాటిపై లేరని, సీనియర్ నాయకుల్లో అయోమయం ఉందని ఆయన అన్నారు. కేవలం కష్టమొచ్చినప్పుడే దేవుణ్ని తలుచుకోవడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications