నందిగ్రామ్‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో రగడ


న్యూఢిల్లీ: ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) నందిగ్రామ్ హింసాకాండపై చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సోమవారం పార్లమెంట్ ఉభయ సభలూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. నందిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడానికి నిరసనగా ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి పార్టీలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి.

నందిగ్రామ్ పై లోక్‌సభలో గందరగోళం నెలకొంది. నందిగ్రామ్ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ముందుగా నోటీసు ఇవ్వకుండా నందిగ్రామ్ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడంతో స్పీకర్ చర్చకు అనుమతించలేదు. దీంతో లోక్‌సభను మధ్నాహ్నం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొనడంతో దానిని కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+