రింగ్ రోడ్డుపై నివేదికకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: మార్చిన అలైన్ మెంట్ మేరకు చేపట్టే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పనులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. సినీనటుడు మురళీ మోహన్ నేతృత్వంలోని జయభేరీ సంస్థ వేసిన పిటిషనుపై సుప్రీంకోర్టు ఈ స్టే ఇచ్చింది. అవుటర్ రింగ్ రోడ్డుపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర జల సంఘం చైర్మన్ ను ఆదేశించింది.
అవుటర్ రింగ్ రోడ్డు వల్ల మూడు జలాశయాలు దెబ్బ తింటాయని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. దీంతో నిపుణులతో అధ్యయనం జరిపించి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు జల సంఘాన్ని ఆదేశించింది. చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియజేయాలని సూచించింది. కేసు విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయదా వేసింది. సీనియర్ అధికారిని తమ వద్దకు పంపాలని సూచించింది.












Click it and Unblock the Notifications