అసెంబ్లీకి హాజరైన టిడిపి ఎమ్మెల్యే చెంగల
హైదరాబాద్: విశాఖ పట్నం జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం శాసనసభ్యుడు చెంగల వెంకటరావు సోమవారం శాసనసభకు హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లా బంగారమ్మపేట ఘర్షణలో హత్య కేసు నమోదు కావటంతో ఆయన కొన్ని రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ లభించకపోవడంతో ఆయన అన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం హైకోర్టు మూడు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైదరాబాదులోనే ఉండాలని మాకవరం, బంగారమ్మపేటలకు వెళ్లరాదని హైకోర్టు చెంగల వెంకట్రావును ఆదేశించింది. దాంతో ఆయన హైదరాబాదులోనే ఉన్నారు.
పాయకరావుపేటలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి అధికారులను నిర్బంధించటం, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి హింసను ప్రోత్సహించడం వంటి కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. పేదల తరఫున పోరాడుతున్న తమపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అత్యవసర పరిస్థితి తర్వాత ఇందిరాగాంధీకి పట్టిన గతే ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications