అక్బరుద్దీన్, నోముల మధ్య వాగ్వివాదం
హైదరాబాద్: శాసనసభలో సోమవారం సిపియం సభ్యుడు నోముల నర్సింహయ్య, మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీల మధ్య వాగ్యుద్ధం జరిగింది. మైనారిటీల సంక్షేమంపై చర్చ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మైనారిటీల సంక్షేమంపై అక్బరుద్దీన్ ఓవైస్ గుజరాత్, నందిగ్రామ్, సిపియం భూపోరాటాలను ప్రస్తావించారు. నందిగ్రామ్ లో ముస్లిం మైనారిటీలను ప్రభుత్వం అణచివేస్తోందని, మహిళపై అత్యాచారం జరిగిందని, సిపియం భూపోరాటాలు ఏమయ్యాయని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.
నందిగ్రామ్ అంశాన్ని అక్బరుద్దీన్ ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తూ నోముల నర్సింహయ్య మైనారిటీలను తాము మాత్రమే బాగు చేస్తున్నామని అక్బరుద్దీన్ చెప్పుకుంటుంటే సహించామని, అయితే పాతబస్తీ ముస్లింల పరిస్థితి పట్టని అక్బరుద్దీన్ ఓవైసీ నందిగ్రామ్ ను ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య సర్దిచెప్పడంతో ఇరువురు శాంతించారు.












Click it and Unblock the Notifications