గవర్నర్ కు యడ్యూరప్ప రాజీనామా లేఖ
బెంగుళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం గవర్నరుకు సమర్పించారు. దక్షిణాదిన ఏర్పడిన తొలి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం వారం రోజులకే కూలిపోయింది. జనతాదళ్ - ఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో యడ్యూప్పరకు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
బలపరీక్షకు ముందే యడ్యూరప్ప గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కాంగ్రెసుతో కలిసి జెడి-ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం అందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో తిరిగి రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications