ఎపి ఎక్సుప్రెస్సుకు తప్పిన ప్రమాదం
వరంగల్: సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎపి ఎక్సుప్రెస్సు రైలుకు గురువారం ముప్పు తప్పింది. వరంగల్ జిల్లా పెండ్యాల వద్ద ఇంజన్ నుంచి 24 బోగీలు విడిపోయాయి. ఈ విషయాన్ని కొంత దూరం పోయిన తర్వాత డ్రైవర్ గుర్తించాడు. ఆ తర్వాత ఇంజనుతో బోగీలను కలిపారు. రైలు బయలుదేరి జమ్మికుంట వద్ద మరో సారి లింక్ తెగిపోయింది. అక్కడ మరమ్మతు చేసిన తర్వాత గంటన్నర ఆలస్యంగా ఎపి ఎక్సుప్రెస్సు బయలుదేరింది.
ఇంజన్ నుంచి బోగీలు విడిపోయిన సమయంలో రైలు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. రైలులో దాదాపు వేయి మంది ప్రయాణికులున్నారు. రైలు గంటన్నర ఆలస్యంగా రామగుండం చేరుకుంది. ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని, ఇలా బోగీలు విడిపోవడం వల్ల ఏ విధమైన హానీ జరగదని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రయాణికులు మాత్రం ఆందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications