పదో తరగతి బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం
మెదక్: మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిని అతను మూడు రోజులు నిర్బంధించి ప్రధానోపాధ్యాయుడు సైమన్ అత్యాచారం చేశాడు. ఈ మేరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో జిల్లా సూపరింటిండెంట్ ఆర్.పి. నాయక్ ను కలిసి ఫిర్యాదు చేసింది.
ఎస్పీకి చేసిన ఫిర్యాదు ప్రకారం - సైమన్ బాలికను గత నాలుగు నెలలుగా బెదిరిస్తున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. చివరికి ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు సైమన్ బాలికను తన సోదరి ఇంట్లో నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశాడు.












Click it and Unblock the Notifications