వైయస్ ప్రతిష్టకేం నష్టం లేదు: మొయిలీ
హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పట్టిన తప్పుల వల్ల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టకు ఏ మాత్రం భంగం కలిగించదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ కాగ్ నివేదిక నష్టం కలిగించబోదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగ్ నివేదిక ప్రభావం ప్రభుత్వంపై పడదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగ్ నివేదిక విశ్లేషణ మాత్రమేనని, అది ప్రభుత్వంపై తుది తీర్పు కాదని ఆయన అన్నారు. కాగ్ నివేదిక అంశాలు పరిశీలనలు, అభిప్రాయాలు మాత్రమేనని ఆయన అన్నారు. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వం తప్పులను గతంలో కాగ్ ఎత్తి చూపిందని ఆయన గుర్తు చేశారు. వరికి మద్దతు ధరపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిదంతా రాజకీయమేనని ఆయన విమర్శించారు. వరికి మద్దతు ధరపై శాసనసభలో ప్రతిపాదించిన తీర్మానం బాగుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications