క్షమాపణ చెప్పకుంటే సమాల్ పై దావా: రత్నప్రభ
హైదరాబాద్: తనపై చేసిన ఆరోపణలకుగాను పది రోజుల్లోగా మాజీ విజిలెన్స్ కమీషనర్ సమాల్ క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని సీనియర్ ఐఎయస్ అధికారి రత్నప్రభ చెప్పారు. పదిరోజుల్లోగా సమాల్ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను 25 ఏళ్లుగా సర్వీసులో ఉన్నానని, ఈ సర్వీసులో తనపై ఎవరూ ఆరోపణలు చేయలేదని ఆమె అన్నారు.
బాధ్యయుతమైన పదవిలో ఉండి పదవీవిరమణ చేసిన సమాల్ తమపై ఆరోపణలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న తనను అప్రతిష్టపాలు చేయడం సమాల్ కు తగింది కాదని ఆమె అన్నారు. ఒక సీనియర్ అధికారి తన కన్నా జూనియర్ అధికారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరి కాదని ఆమె అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యంతో ఇటువంటి ఉద్యోగాల్లో చేరుతారని, వారి జీవిత నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిపై అనుచితంగా మాట్లాడటం సరి కాదని రత్నప్రభ అన్నారు.












Click it and Unblock the Notifications