బిజెపిలో మళ్లీ ఉమః రాజ్‌నాథ్ సూచన
న్యూఢిల్లీ: భారతీయ భారత పార్టీ (బిజెపి)మళ్లీ ఉమాభారతి ప్రవేశించవచ్చని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా వెల్లడించారు. సీనియర్ బీజేపీ నేత పెజావర్ స్వామి (గురూజీ) వంటి గౌరవ నేత చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఆమెను మళ్లీ పార్టీలో చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఉమా భారతి తిరిగి పార్టీలో చేర్చుకోవాలని ఆసక్తి తమకు లేదని సీనియర్ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నెల రోజుల క్రితమే చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ మాట మార్చడం గమనార్హం. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఉమాభారతి వైపు మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాలు తెలిపాయి.
పార్టీ సీనియర్ నేతలపై బహిరంగంగా ధ్వజమెత్తిన కారణంగా రెండేళ్ల క్రితం పార్టీనుంచి బహిష్కరణకు గురైన ఉమాభారతి ఆ తర్వాత భారతీయ జనశక్తి పేరుతో సొంత పార్టీని స్థాపించారు. యుపీ ఎన్నికల్లో ఆమె పార్టీ పెద్దగా విజయాలు సాధించనప్పటికీ, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయగల ప్రభావాన్ని చూపగలరని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications