బెంగుళూరులో పట్టుబడిన స్వప్న
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల బంజారా కాలనీ నుంచి స్వప్నను పోలీసులు బెంగుళూరులో పట్టుకున్నారు. ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆమెను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మనోహర్ అనే యువకుడిని స్వప్న పెళ్లి చేసుకుని బెంగుళూర్ వెళ్లినట్లు సమాచారం.
స్వప్న ఆచూకీపై కొద్ది రోజులుగా వివిధ కథనాలు ప్రచారమవుతున్నాయి. స్వప్నను తిరుపతిలో పోలీసులు పట్టుకుని హైదరాబాదు తీసుకొచ్చినట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే స్వప్న ఆచూకీ దొరకలేదని సనత్ నగర్ ఎసిపి మాధవాచారితో పాటు సైబరాబాద్ పోలీసు కమీషనర్ ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పారు. ప్రేమ వ్యవహారమే స్వప్న అదృశ్యానికి కారణమని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
