ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ అరెస్టు, విడుదల
హైదరాబాద్: హైదరాబాదులోని నీలోఫర్ అస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడి కేసులో పోలీసులు శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ ను అరెస్టు చేసి, విడుదల చేశారు. అఫ్సర్ ఖాన్ పై 353, 323, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు హైదరాబాదు పోలీసు కమీషనర్ బల్వీందర్ సింగ్ చెప్పారు. అఫ్సర్ ఖాన్ అనుచరుడు నసీరుల్లాపై కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు.
తాను జూనియర్ డాక్టర్లపై దాడి చేయలేదని అఫ్సర్ ఖాన్ చెప్పారు. అఫ్సర్ ఖాన్ ను సస్పెండ్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండును నెరవేర్చేవరకు ఆందోళన ఆగదని వారంటున్నారు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
