జర్నలిస్టు అదృశ్యం: పోలీసులపై అనుమానం
ఒంగోలు: ప్రకాశం జిల్లా కందుకూరులో హైదరాబాదుకు చెందిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం అదృశ్యమయ్యాడు. ఆయన అదృశ్యానికి పోలీసులే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిట్టల శ్రీశైలంను వెంటనే విడుదల చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి కందుకూరుకు విలేకరుల బృందం ఒకటి వెళ్లింది. ఈ బృందంలోంచి పిట్టల శ్రీశైలం అదృశ్యమయ్యాడు. పిట్టల శ్రీశైలంను పోలీసులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఎపియుడబ్ల్యుజె) ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఎపి ఎలక్ట్రానిక్స్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు సి. హరిప్రసాద్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications