అఫ్సర్ ఖాన్ దాడి చేయలేదు: అక్బర్
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లపై తమ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ దాడి చేయలేదని మజ్లీస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తమ శాసనసభ్యుడిపై కొన్ని శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. అఫ్సర్ ఖాన్ వ్యవహారంపై ఆయన గురువారంనాడు శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డిని కలిశారు. జూనియర్ డాక్టర్లు ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే విధులకు హాజరు కావాలని ఆయన అన్నారు.
కొన్ని శక్తులు పనిగట్టుకుని తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో వైద్యం అందని రోగులకు ఓవైసీ అస్పత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన చెప్పారు. తమపై దాడి చేసిన అఫ్సర్ ఖాన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications