చిరు పార్టీ పెడతారు: బొండా శ్రీనివాసరావు
విజయవాడ: మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడతారనే సంకేతాలు అందాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన బొండా శ్రీనివాసరావు అన్నారు. చిరంజీవి పెట్టబోయే పార్టీ కోసం ఆయన పిసిసి పదవికి రాజీనామా చేశారు. బొండా శ్రీనివాసరావు తమ్ముడు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి. చిరంజీవి అభిమానులతో ఆయన రేపు (శుక్రవారం) ఐవి ప్యాలెసులో సభను ఏర్పాటు చేసినట్లు బొండా శ్రీనివాస రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ తర్వాత పామర్రులో జరుగుతుందని, ఈ సమావేశాలకు పదేసి వేల మంది హాజరవుతారని ఆయన అన్నారు.
అవినీతికి, రాజకీయ కల్మషానికి వ్యతిరేకంగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని ఆయన చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందువల్ల చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని, వస్తారని ఆయన అన్నారు. వంగవీటీ రాధాకృష్ణను శాసనసభ్యుడ్ని చేసింది తానేనని, ఎవరిని అడిగినా ఈ విషయం చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications