సర్వేకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదేశాలు
విశాఖపట్నం: మెగాస్టార్ చిరంజీవి పెట్టబోయే పార్టీ గురించి సర్వే చేయాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చాయని చిరంజీవి అభిమానుల సంఘం విశాఖపట్నం అధ్యక్షుడు సతీష్ చెప్పారు. పార్టీ పేరు, ఆశయాలు, జెండా, జెండా రంగు తదితర విషయాలపై సర్వే చేయాల్సిందిగా తమకు ఆదేశాలు వచ్చాయని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయమని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తమకు ఆదేశాలు రావడాన్ని బట్టే చిరంజీవి పార్టీ పెట్టడం ఖాయమని తేలిపోతోందని ఆయన అన్నారు. పార్టీ పెట్టకపోతే తమకు ఆ విధమైన ఆదేశాలు రాబోవని ఆయన అన్నారు.
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాలని కోరుతూ శుక్రవారం భిమిలీలో ఉత్తరాంధ్ర జిల్లాల చిరంజీవి అభిమానుల ర్యాలీ, సభ జరుగుతాయి. విజయవాడలో కూడా రేపు చిరంజీవి అభిమానుల సంఘం సభ జరుగనుంది. పార్టీ పేరు ఏమైతే బాగుంటుందనే విషయాన్ని మేధావుల నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని, ప్రజల్లోకి ఏ నినాదాలతో వెళ్లాలి అనే విషయాలను కూడా కనుక్కోవాలని తమకు ఆదేశాలు అందినట్లు సతీష్ చెప్పారు.












Click it and Unblock the Notifications