చిరంజీవిపై చర్చించం: రాఘవులు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంపై తాము చర్చించబోమని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. సిపియం రాష్ట్ర కమిటీ సమావేశాలు గురువారం నుంచి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై తమ సమావేశాల్లో చర్చించబోమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవి పెట్టబోయే పార్టీలోకి తమవారు వలసలు పోతారనే బెంగ తమకు లేదని ఆయన అన్నారు.
పార్టీ సమావేశాల్లో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చించే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు అడిగితే చర్చించబోమని ఆయన సమాధానమిచ్చారు. తమ పార్టీపై చిరంజీవి రాజకీయాల ప్రభావం ఉండదని ఆయన అన్నారు. అయితే తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు గురించి మాత్రం సమావేశాల్లో చర్చిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications