బ్లాక్ డే: పాతబస్తీ ప్రశాంతం
హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా ముస్లిం సంస్థలు హైదరాబాదులో గురువారం చేపట్టిన బ్లాక్ డే ప్రశాంతంగా ముగిసింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ముస్లింల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు వందల మంది ప్రార్థనలకు వచ్చారు. బ్లాక్ డే సందర్భంగా ముస్లిం సంస్థలు బంద్ నిర్వహించాయి. ఈ సందర్భంగా పాతబస్తీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
హైదరాబాద్ పాతబస్తీలో పాఠశాలలు, దుకాణాలు మూసేశారు.బ్లాక్ డే సందర్భంగా మెదక్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కాస్తా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో ఒక మహిళతో పాటు కొంత మంది పిల్లలు గాయపడ్డారు. ఒక వర్గంవారి దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) రేపు (శుక్రవారం) బంద్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications