పోలీసు వాహనంపై మావోయిస్టుల దాడి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్న వాహనంపై మావోయిస్టులు గురువారంనాడు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు - గూడెం కొత్తవీధి మండలాల సరిహద్దులో బుధవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు.
ఈ సంఘటన కుంకుమపూడి వద్ద జరిగింది. ఎదురుకాల్పుల్లో మరణించిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వాహనం కుంకుమపూడి వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ మందుపాతరలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications