మార్కాపురం కోర్టుకు సాగర్
హైదరాబాద్: మావోయిస్టు నల్లమల డివిజన్ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్ అలియాస్ ప్రతాప్ అలియాస్ పాండురంగారెడ్డిని ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టులో గురువారం సాయంత్రం ప్రవేశపెట్టనున్నారు. సాగర్ తో పాటు ఆయన భార్య మాధవి అలియాస్ మేరీని, వారికి ఆశ్రయం ఇచ్చినవారిని పోలీసులు బుధవారం సాయంత్రం చెన్నైలో అరెస్టు చేశారు.
సాగర్ ప్రకాశం, గుంటూరు జిల్లాల మావోయస్టు కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ లడ్హా మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ విచారణలో సాగర్ అన్ని విషయాలూ వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. సాగర్ ను చూడడానికి కోర్టు వద్ద భారీగా జనం వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. సాగర్ ను చెన్నై నుంచి దోర్నాలకు సమీపంలోని పున్నమి గెస్ట్ హౌస్ కు తరలించారు. అక్కడి నుంచి దోర్నాలకు అతన్ని తీసుకొచ్చారు. భారీ భద్రత మధ్య అతన్ని మార్కాపురం తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications