ఇంటర్వ్యూ కోసమే వెళ్లా: శ్రీశైలం
నెల్లూరు: పోలీసులు తనను కిడ్నాప్ చేశారని ప్రకాశం జిల్లా కందుకూరులో అరెస్టయిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం అన్నారు. పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించారు. శ్రీశైలంను పోలీసులు గురువారం నాడు కందుకూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసులు తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆయన మీడియా సమావేశంలో అన్నారు.
పోలీసులే తనను మావోయిస్టుల కొరియరుగా చిత్రీకరిస్తున్నారని, తనకు మావోయిస్టులతో ఏ విధమైన సంబంధాలు లేవని ఆయన అన్నారు. ఇంటర్వ్యూ కోసమే తాను కందుకూరు వెళ్లానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications