స్వప్న తల్లిదండ్రుల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో గల బంజారా కాలనీలో స్వప్న అనే యువతి అదృశ్యం కేసులో ఆమె తల్లిదండ్రులను పోలీసులను అరెస్టు చేశారు. వారితో పాటు 20 మందిని పోలీసులు అరెస్టు చేసి మియాపూర్ కోర్టుకు తరలించారు. ఆటోల ధ్వంసం కేసులో వీరిని అరెస్టు చేశారు. స్వప్నను ఒక ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కాలనీవాసులు ఆటోలను ధ్వంసం చేశారు.
స్వప్నను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆమె తిరుపతి వెళ్లిందని కొద్ది రోజుల తర్వాత పోలీసులు తేల్చారు. ఆమెను బెంగుళూరులో పట్టుకుని పోలీసులు హైదరాబాదుకు తీసుకొచ్చారు. ప్రేమ పెళ్లి చేసుకోవడానికి స్వప్న వెళ్లిందని తెలిసిన వెంటనే ఎర్రగడ్డ ప్రాంతంలోని ఆటో డ్రైవర్లు సనత్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications