చంద్రబాబుకు పట్టని పాలారు: వైయస్
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ప్రజలకు నీరందించడానికి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలారు ప్రాజెక్టును చేపట్టలేకపోయారని, ఆ దిశగా చంద్రబాబు ఆలోచన కూడా చేయలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లెలో ఆయన గురువారంనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. కుప్పం నియోయకవర్గానికి కృష్ణా నదీ జలాలు అందించలేకపోయినా పాలారు ప్రాజెక్టును నిర్మించి నీరందిస్తామని ఆయన చెప్పారు.
రైతులకు తాము ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, తాము ఈ విషయంలో మాటకు కట్టుబడి వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని, పేదల సంక్షేమానికి పాటుపడుతుందని ఆయన అన్నారు. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications