అఫ్సర్ ఖాన్ పై హత్యాయత్నం కేసు నమోదు!
హైదరాబాద్-హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నీలోఫర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడి జరిపిన ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్, అతని అనుచరులపై విచారణ జరిపి కోర్టుకు సమర్పించాలని నాంపల్లి కోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మేల్యేపై కేసును నమోదు చేశారు. కేసును విచారించిన తరువాత కోర్టుకు తమ నివేదికను సమర్పిస్తామని డీసీపి ఇక్బాల్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
మరోవైపు హక్కుల కమీషన్ జూనియర్ డాక్టర్ల ఆందోళనకు సంబంధించి విచారణ జరుపుతోంది. ఎమ్మెల్యేలకేనా భద్రత డాక్టర్లకు భద్రత లేదా అని కమిషన్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. అయితే విచారణకు అఫ్సర్ ఖాన్ హాజరుకావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. తమ ముందు హాజరు కావాలని అఫ్సర్ ఖాన్ మళ్లీ నోటీసులు పంపిస్తామని కమిషన్ పేర్కొంది.












Click it and Unblock the Notifications