కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రకాశం జిల్లాకు సాగర్ తరలింపు
కడప: న్యాయవాదులు వారించిన లక్ష్యపెట్టకుండా పోలీసులు విచారణ పేరిట మావోయిస్టు అగ్రనేత సాగర్ ను కడప జైలు నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారు. కోర్టు అనుమతి లేకుండా పోలీసులు ప్రకాశం జిల్లాకు తరలించడంతో కడపజైలుకు వచ్చిన సాగర్ తండ్రి రంగారెడ్డి, సోదరి భూదేవమ్మ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
న్యాయవాదులు, జర్నలిస్టుల సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు మావోయిస్టు నేత సాగర్ ను తమ స్టైల్లోనే విచారించారు. జర్నలిస్టులు జైలులోపలికి వెళదామని ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలో తాము సాగర్ కు తెలిసిన కొన్ని కీలక స్థాలాలను పరిశీలించాల్సి ఉందని, న్యాయవాదులు కూడా రావచ్చని పోలీసులు చెప్పారు. ప్రకాశం జిల్లాకు తీసుకువెళ్లడమే న్యాయవిరుద్ధమంటుంటే చెట్లు, దుప్పలలోకి తామెలా వస్తామని న్యాయవాదులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా చెన్నయ్ అరెస్ట్ అయిన సాగర్ భార్య మాధవిని పోలీసులు మార్కాపురానికి తరలిస్తున్నారు. మరోవైపు కడప జిల్లా సిద్ధవటం ప్రాంతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయని పేర్కొంటూ 9మంది హరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications