బంగాళాఖాతంలో వాయుగుండం.. తుఫానుగా మారుతోందా?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రాంతంలో వాతావరణం అల్లకల్లోలంగా మారనుందని, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నిన్నటి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం.. ఈ రోజు (జూలై 5, 2026) ఉదయం 08:30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కి.మీ, చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో పాటు నైరుతి రుతుపవన ద్రోణి, షియర్ జోన్ (గాలుల కోత) కూడా బలంగా కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

Bay of Bengal Cyclone Alert IMD Warns of Heavy Rains and Strong Winds in Andhra Pradesh for 3 Days

రాబోయే మూడు రోజుల పాటు ప్రాంతాల వారీగా వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి:

1. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

  • ఈరోజు (జూలై 5): అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
  • రేపు (జూలై 6): కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
  • ఎల్లుండి (జూలై 7): వర్షాలు కొనసాగుతాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
నడి సముద్రంలో ఏడుగురు జాలర్లు గల్లంతు.. అల్పపీడన గండం!
నడి సముద్రంలో ఏడుగురు జాలర్లు గల్లంతు.. అల్పపీడన గండం!

2. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

  • ఈరోజు, రేపు: కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
  • ఎల్లుండి: కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

3. రాయలసీమ:

  • మూడు రోజుల పాటు (ఈరోజు, రేపు, ఎల్లుండి): రాయలసీమ పరిధిలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
రుతుపవనాల విశ్వరూపం.. విస్తరించిన భారీ వర్షపు మేఘాల వరుస!
రుతుపవనాల విశ్వరూపం.. విస్తరించిన భారీ వర్షపు మేఘాల వరుస!

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదని, బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని వాతావరణ కేంద్రం సంచాలకులు హెచ్చరించారు. ముసరు వాతావరణం, ఈదురు గాలుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+