Kannappa : యూట్యూబ్‌లో ‘కన్నప్ప’ శివతాండవం..!
డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్, విజువల్ వండర్ 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. గత ఏడాది థియేటర్లలో గ్రాండ్ ఆడియన్స్ సపోర్ట్‌తో దూసుకెళ్లిన ఈ భక్తిరస చిత్రం.. రీసెంట్‌గా రిలీజ్ అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా రీ-రిలీజ్ అయి అక్కడ కూడా కాసుల వర్షం కురిపించింది.
అయితే, ఇప్పటివరకు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారికి, అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునే శివభక్తులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్యాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ ఇప్పుడు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది.

టాప్ ప్రొడక్షన్ హౌసెస్ 'అవా ఎంటర్టైన్మెంట్స్', '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' బ్యానర్ల మీద కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ విజువల్ గ్రాండ్నెస్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఇప్పుడు 'అవా ఎంటర్టైన్మెంట్' అధికారిక యూట్యూబ్ చానెల్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని ప్రముఖ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మరియు మలయాళం లో ఈ సినిమాను ఫ్రీగా వీక్షించేలా అందుబాటులో ఉంచారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ మూవీ లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్ వైపు దూసుకుపోతోంది. 'కన్నప్ప' సినిమా ఇంతటి భారీ విజయాన్ని, ప్యాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి.. ఈ సినిమాలో నటించిన అగ్ర నటీనటుల తారాగణం. ఒకే స్క్రీన్‌పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాలు కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా అలరించగా.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ కీలక పాత్రల్లో మెరిశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం లీడ్ రోల్స్ పోషించి సినిమా స్థాయిని పెంచారు. పరమశివుని పరమభక్తుడైన కన్నప్ప కథను సరికొత్త గ్రాఫిక్స్, ఎమోషన్స్‌తో మంచు విష్ణు స్క్రీన్ మీద ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. థియేటర్ల తర్వాత ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్లను కూడా కన్నప్ప షేక్ చేస్తోంది.












Click it and Unblock the Notifications