మాకు సెక్యూరిటీ కల్పించాలి: జుడాలు
హైదరాబాద్-విధులను బహిష్కరించి ఆందోళన కొనసాగించాలని తమకేం ఉండదని నీలోఫర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు అంటున్నారు. తమలో ఇంకా అభద్రత భావన కొనసాగుతోందని, ఈ భావన తొలిగిపోవడానికి ప్రభుత్వం తమకు సెక్యూరిటీ కల్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తప్పు కప్పిపుచ్చు కోవడానికే జూనియర్ డాక్టర్లు తమ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని కోరుతున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారు. తప్పంతా జూనియర్ డాక్టర్లేదేనని, వారి తప్పు బయటపడకుండా ఆందోళన చేస్తూ డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. నీలోఫర్ లో చిన్నారుల మృతికి కారణం డాక్టర్లేనని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications