ఒకే విమానంలో వైయస్, కెసిఆర్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సోమవారం ఒకే విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. వారిద్దరు విమానాశ్రయం లాంజ్ లో ఎదురుపడి పలకరించుకున్నారు. రాజకీయంగా నిత్యం మాటలు సంధించుకుంటున్న వీరిరువురు పలకరించుకోవడం ఆసక్తిని రేపింది.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఆయన సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించారు. అలాగే వివిధ కేంద్ర మంత్రులను కలుసుకుని విజ్ఞప్తులు చేశారు. కెసిఆర్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వచ్చారు. బియస్పీ నాయకురాలు మాయావతి, కేంద్ర మంత్రులు శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ఫోనులో తెలంగాణకు మద్దతు కోరారు.












Click it and Unblock the Notifications