వీడని మనీషా కిడ్నాప్ మిస్టరీ
వరంగల్: వరంగల్లులోని కాశిబుగ్గ పద్మనగర్ లో అపహరణకు గురైన బాలిక మనీషా ఆచూకీ ఇంకా మిస్టరీగానే మిగిలింది. మనీషా ఆచూకీ కోసం పోలీసులు హైదరాబాదులో కూడా గాలింపు మొదలు పెట్టారు. బాలిక ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ కూతురు అపహరణకు గురై మూడు రోజులవుతున్నా ఆచూకీ లేకపోవడంతో మనీషా తల్లిదండ్రులు కరుణశ్రీ, సదానందం ఆందోళనకు గురవుతున్నారు.
మనీషాను వదిలిపెట్టడానికి కిడ్నాపర్లు 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని, తమ కూతురిని క్షేమంగా వదిలేస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటామని వారు వేడుకుంటున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్ గుర్తించి, ఆ ఫోన్ చేసిన వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications